ఛత్తీస్‌గఢ్‌లో మరో 3 నెలల పాటు కర్ఫ్యూ పొడిగింపు..

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కాగా.. ఛత్తీస్‌గఢ్ లో మరో మూడు నెలలపాటు కర్ఫ్యూ పొడిగించారు. కరోనా

ఛత్తీస్‌గఢ్‌లో మరో 3 నెలల పాటు కర్ఫ్యూ పొడిగింపు..

Edited By:

Updated on: May 18, 2020 | 5:35 PM

Chhattisgarh: కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కాగా.. ఛత్తీస్‌గఢ్ లో మరో మూడు నెలలపాటు కర్ఫ్యూ పొడిగించారు. కరోనా మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఒక్కసారిగా పెరగొచ్చని కలెక్టరలందరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆదివారం నాడు 25 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 92కు చేరుకుంది. 32 మంది చికిత్స పొందుతుండగా.. 59 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.