ట్రంప్ కోర్టు కేసు ఖర్చుల కోసం ‘జోలె’ పట్టిన రిపబ్లికన్లు

| Edited By: Pardhasaradhi Peri

Nov 07, 2020 | 4:03 PM

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ సుప్రీంకోర్టు కెక్కుతున్న విషయం తెల్సిందే. ఓట్ల లెక్కింపులో ఫ్రాడ్ జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ప్రచార సిబ్బంది, రిపబ్లికన్లు  వివిధ రాష్ట్రాల్లో దావాల మీద దావాలు వేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి వ్యయమయ్యే ఖర్చులకోసం 60 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించాలని వీరు నిర్ణయించారు. అనేక రాష్ట్రాల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యం ఎప్పటికప్పుడు వెల్లువెత్తుతుండడంతో వీరంతా బేర్ మంటున్నారు. తమకు కనీసం 60 మిలియన్ డాలర్లయినా అవసరం […]

ట్రంప్ కోర్టు కేసు ఖర్చుల కోసం జోలె పట్టిన రిపబ్లికన్లు
Follow us on

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ సుప్రీంకోర్టు కెక్కుతున్న విషయం తెల్సిందే. ఓట్ల లెక్కింపులో ఫ్రాడ్ జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ప్రచార సిబ్బంది, రిపబ్లికన్లు  వివిధ రాష్ట్రాల్లో దావాల మీద దావాలు వేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి వ్యయమయ్యే ఖర్చులకోసం 60 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించాలని వీరు నిర్ణయించారు. అనేక రాష్ట్రాల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యం ఎప్పటికప్పుడు వెల్లువెత్తుతుండడంతో వీరంతా బేర్ మంటున్నారు. తమకు కనీసం 60 మిలియన్ డాలర్లయినా అవసరం అని ఓ రిపబ్లికన్ అన్నారు. ఇక రిపబ్లికన్ నేషనల్ కమిటీ ఈ విరాళాల సేకరణ భారాన్ని నెత్తికెత్తుకుంది. దయచేసి డొనేషన్లు ఇవ్వాలంటూ వీరు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించారు. ట్రంప్ ప్రచార సిబ్బంది జార్జియా సహా కొన్ని రాష్ట్రాల్లో కోర్టు కేసులు ఓడిపోయినప్పటికీ. శుక్రవారం పెన్సిల్వేనియాలో లీగల్ విజయం సాధించారు . సకాలంలో మెయిల్-ఇన్-బ్యాలట్స్ రానివాటిని, ప్రొవిజనల్ బ్యాలట్స్ ను పక్కన పెట్టాలని అక్కడి కోర్టు… ఎన్నికల అధికారులను ఆదేశించింది.