యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన ఘాట్ రోడ్డు

యాదాద్రి అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయలంతోపాటు ఆలయంకు చేరుకునే రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కొండపైకి...

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన ఘాట్ రోడ్డు

Updated on: Nov 17, 2020 | 6:21 PM

Yadadri Ghat Road : యాదాద్రి అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయలంతోపాటు ఆలయంకు చేరుకునే రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కొండపైకి వెళ్లేందుకు నూతనంగా గౌడ సత్రం వద్ద నిర్మించిన ఘాట్‌రోడ్డు ఆలయ అధికారులు తిరిగి ప్రారంభించారు.

గతేడాదిలోనే ఘాట్‌రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే.. తుర్కపల్లి నుంచి యాదాద్రికి ఫోర్‌లైన్‌ రోడ్ల వెడల్పు నిమిత్తం ఘాట్‌రోడ్డు వద్ద తవ్వకాలు జరిపారు. దీంతో ఘాట్‌రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.

తాజాగా రోడ్డు పనులు పూర్తికావడంతో పాటు కార్తీకమాసంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇటు భక్తుల వాహనాలు, ఆటు ఆలయ పనుల్లో నిమగ్నమైన వాహనాలకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా ఉండేలా ఆలయ అధికారులు ఘాట్‌రోడ్డును తిరిగి ప్రారంభించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us