మొబైల్ విక్రయాల్లో వెనకబడిన ప్రముఖ కంపెనీ.. తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.. ఏడాదిలో కేవలం..

| Edited By: Pardhasaradhi Peri

Dec 28, 2020 | 8:16 AM

కొవిడ్ సంక్షోభంలో సెల్‌ఫోన్ పరిశ్రమ ఒడిదొడుకులతో కొనసాగుతోంది. ఎందుకంటే లాక్‌డౌన్ వల్ల చాలామందికి ఉద్యోగాలు, ఉపాధి పోవడం వల్ల ఎక్కువ కాలం పాటు

మొబైల్ విక్రయాల్లో వెనకబడిన ప్రముఖ కంపెనీ.. తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.. ఏడాదిలో కేవలం..
Follow us on

కొవిడ్ సంక్షోభంలో సెల్‌ఫోన్ పరిశ్రమ ఒడిదొడుకులతో కొనసాగుతోంది. ఎందుకంటే లాక్‌డౌన్ వల్ల చాలామందికి ఉద్యోగాలు, ఉపాధి పోవడం వల్ల ఎక్కువ కాలం పాటు ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయి తయారీదారులకు ఇక్కట్లు తప్పలేదు. దీంతో మొబైల్ తయారీ కంపెనీ దారులు సరఫరా, విక్రయాల విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.

షావోమి లాంటి బ్రాండ్లు మాత్రమే కరోనా సవాళ్లను అధిగమించి మెరుగైన లాభాలను సాధించింది. ఎందుకంటే ఈ కంపెనీ ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్ అమ్మకాలపై ఎక్కువగా ద‌ృష్టి సారించి విక్రయాలు సాగించింది. అయితే ఈ విషయంలో శాంసంగ్ లాంటి కంపెనీలు వాటి దూకూడుకు పోటీ ఇవ్వలేకపోయాయి. అమ్మకాలు తగ్గిపోయి డీలా పడిపోయింది. తొమ్మిది సంవత్సరాల తర్వాత మొదటి సారి మొబైల్ అమ్మకాలలో వెనుకబడిపోయింది. జీఎస్ఎం అరెనా సేకరించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలో శాంసంగ్ 30 కోట్ల ఫోన్‌ల అమ్మకాలు చేయలేకపోయిందని కేవలం 27 కోట్లతో సరిపెట్టుకుందని వెల్లడించింది. ఈ విషయంలో షావోమి, రియల్‌మి కంపెనీలు చాలా ముందువరసలో నిలిచినట్లు తెలిపింది.