
Ravi Teja Krack Trailer: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్’. న్యూఇయర్ కానుకగా కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. రవితేజ పవర్‌ఫుల్ డైలాగులతో పాటు మాస్ సీన్స్‌తో ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శృతి హసన్ గ్లామర్ చిత్రానికి ప్లస్ కానుంది.
తెలుగు రాష్ట్రాలలోని యదార్ధ సంఘటనలు ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం కావడం విశేషం. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై బి. మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.