కరోనా మహమ్మారి ప్రభావంతో సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే థియేటర్స్ ఓపెన్ కాలేదు. దీంతో ఎన్నో సినిమాల విడుదలలు ఆగిపోయాయి. స్టార్ హీరోల సినిమాలు తప్పించి.. చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రభుత్వాలు సినిమా, సీరియల్స్ షూటింగులకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. కోవిడ్ మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టకపోయేసరికి షూటింగ్స్ ఆగిపోయాయి. ఇక కరోనా టైంలో ఓటీటీ యాప్‌లకు బాగా క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే.
అయితే మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘క్రాక్’. ఈ సినిమాకి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, బి మధు నిర్మిస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని రవితేజ.. ఈ సినిమాపైనే బాగా ఆశలు పెట్టుకున్నాడు. ఇక క్రాక్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని చాలా కాలంగా పలు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన గోపిచంద్ వాటన్నింటికీ చెక్ పెట్టేశాడు. ”క్రాక్ చిత్రం తప్పకుండా థియేటర్స్‌లోనే విడుదలవుతుందని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్” చేశాడు. దీంతో క్రాక్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమాలో రవితేజ, శృతిహాసన్, సుమద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాకర్, వంశీ చాగంటి తదితరులు నటించారు.
#krack in Theaters only ?? pic.twitter.com/19wjlPGQ4S
— Gopichandh Malineni (@megopichand) August 14, 2020
Read More:
ఓటీటీల్లో నటించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అరవింద్