తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు

తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఆలయ అధికారులు రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం ఆలయ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారి దర్శనం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 1న ఆర్జిత సేవలతో పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. […]

తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు

Edited By:

Updated on: Jan 21, 2020 | 10:23 PM

తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఆలయ అధికారులు రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం ఆలయ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారి దర్శనం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 1న ఆర్జిత సేవలతో పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.