
కడప జిల్లా జమ్మలమడుగు దగ్గరున్న సుగమంచిపల్లి ప్రాంతంలో ఇవాళ కోలాహల వాతావరణం నెలకొంది. పెన్నా నది ఒడ్డున వెయ్యేళ్ళ నాటి దేవాలయం బయటపడ్డమే దీనికి కారణం. దీనిని రాష్ట్ర కూటుల కాలం నాటి శివ దేవాలయంగా గుర్తించారు. ఇసుకలో ఉన్న శివ ఆలయంలో దెబ్బతిన్న శాసనాలు కూడా బయట పడ్డాయి. ఇవి రాషారకునా రాజవంశంలోని రాజుకి చెందినదిగా సమాచారం. వీటిపై 10 వ శతాబ్దపులోని సంస్కృత భాష, ఇంకా కన్నడ అక్షరాలతో రాసి ఉంది. ఇది రాష్ట్రకూట రాజుల గురించి వివరించే శాసనాలుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.