రషీద్ విజృంభణ… ఒకే ఓవర్లో రెండు వికెట్లు

|

Oct 27, 2020 | 10:59 PM

హైదరాబాద్‌ దూకుడు ముందు ఢిల్లీ తడబడుతోంది. నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నేల చూపులు చూస్తోంది. 55 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు...

రషీద్ విజృంభణ... ఒకే ఓవర్లో రెండు వికెట్లు
Follow us on

Rashid Khan Registers :హైదరాబాద్‌ దూకుడు ముందు ఢిల్లీ తడబడుతోంది. నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నేల చూపులు చూస్తోంది. 55 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. సందీప్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బంతికి సూపర్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌.. వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇంటిదారి పట్టాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన స్టాయినీస్‌ కూడా కాసేపు మాత్రమే నిలిచాడు. నదీం బౌలింగ్‌లో స్టాయినీస్‌ కూడా వార్నర్‌కు చేతికి చిక్కాడు.

రహానె నిలకడగా రాణించడంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ 54/2తో నిలిచింది. ఏడో ఓవర్లో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీ జట్టు మరింత దెబ్బ తీశాడు. తన తొలి ఓవర్‌ మొదటి బంతికే హెట్‌మైయర్‌ను బౌల్డ్‌ చేశాడు. అదే ఓవర్‌ ఐదో బంతికి నిదానంగా ఆడుతున్న రహానెను ఎల్బీడబ్లూగా పెవిలియన్‌కు చేర్చాడు.

విజయ్‌ శంకర్‌ వేసిన 12వ ఓవర్లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ కూడా వెనుదిరిగడంతో సన్‌రైజర్స్‌ గెలుపు దాదాపు ఖాయమైంది.