హిందూ మతం హింసకు అతీతమైనది కాదని ఏచూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసేనని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఏచూరిపై ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులకు యోగా గురువు రాందేవ్ బాబా ఫిర్యాదు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాలను ఏచూరి అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల పవిత్ర గ్రంథాలను అవమానించిన ఏచూరిపై ఫిర్యాదు చేశామని.. ఇది ముమ్మాటికీ క్షమించదగినది కాదని.. ఏచూరి కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని రాందేవ్ బాబా అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రాందేవ్ బాబాతో పాటుగా పలువురు సాధువులు కూడా ఫిర్యాదు చేశారు.