
Ram Charan In Gowtham Tinnanuri Direction: నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్‌గా ఎదగాలని ఆశలుపడే ఓ యువకుడు తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు దర్శకుడు ఎంతో సహజంగా చూపించాడు. ఇక ఈ సినిమాను నాని తన నటనతో ఒక రేంజ్‌కు తీసుకెళ్లాడు.
ఈ సినిమా విజయంతో గౌతమ్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో మారుమోగింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌతమ్‌కు లక్కీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ నచ్చడంతో చెర్రీ సినిమాకు వెంటనే ఓకే చేశాడని టాక్. ఇక ఈ సినిమా జెర్సీలాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. నటకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో చెర్రీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తకు సంబంధించి క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే చెర్రీ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
Also Read: మిస్టర్ సీ తో ఉన్నానన్న కొణిదెల కోడలు… క్వారంటైన్‌లో వెళ్లామని సోషల్ మీడియా ద్వారా వెల్లడి..