మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ సంవత్సరం మొదటిసారిగా మాజీ మంత్రి సునీత, సీతక్క రాఖీలు కట్టారు. అస్వస్థతగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ నివాసంలోని విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడకు వెళ్లి సునీత, సీతక్క రాఖీ కట్టి.. చంద్రబాబుకు స్వీట్లు తినిపించారు. ఆయన ఆరోగ్యం బావుండాలని.. కోరుకున్నట్లు వారు తెలిపారు. ఇటీవలే చంద్రబాబు తన ఆరోగ్యం కోసం అమెరికాలో మెరుగైన వైద్య చికిత్స చేయించుకుని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.