లొంగుబాటుకు తిరస్కరించిన రాకేష్ తికాయత్, అవసరమైతే మరింతమంది రైతులను సమీకరిస్తామని వ్యాఖ్య.

పోలీసులకు లొంగిపోయేందుకు తాను తిరస్కరిస్తున్నానని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని..,

లొంగుబాటుకు తిరస్కరించిన రాకేష్ తికాయత్, అవసరమైతే మరింతమంది రైతులను సమీకరిస్తామని వ్యాఖ్య.

Edited By: Anil kumar poka

Updated on: Jan 28, 2021 | 6:49 PM

పోలీసులకు లొంగిపోయేందుకు తాను తిరస్కరిస్తున్నానని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, పరిస్థితిని వేరుగా చూపేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు కారకులైన వారి కాల్ డీటెయిల్స్ పరిశీలించాలని, ఆ ఘటనలకు, దీప్ సిద్ధుకు గల లింక్ పై ఈ దేశ ప్రజలు తెలుసుకోగోరుతున్నారని ఆయన అన్నారు.  అవసరమైతే గ్రామాలనుంచి మరింత మంది  గ్రామీణులను, రైతులను రప్పిస్తామన్నారు. ఎర్రకోట ఘర్షణలపై సుప్రీంకోర్టు కమిటీ విచారణ జరపాలని రాకేష్ తికాయత్ కోరారు. కాగా ఈయన పోలీసులకు లొంగిపోనున్నారని మొదట వార్తలు వచ్చాయి. ఖాకీలు ఈయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.