లోకేష్ పరామర్శ: ‘దేశమంతా అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తుంది.. ఎపిలో రాజారెడ్డి రాజ్యాంగం అమలౌతోంది’

|

Dec 30, 2020 | 7:05 PM

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయ్యాక మళ్ళీ ఫ్యాక్షనిజం మొదలయ్యిందని వ్యాఖ్యానించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. "దేశమంతా..

లోకేష్ పరామర్శ: దేశమంతా అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తుంది.. ఎపిలో రాజారెడ్డి రాజ్యాంగం అమలౌతోంది
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయ్యాక మళ్ళీ ఫ్యాక్షనిజం మొదలయ్యిందని వ్యాఖ్యానించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. “దేశమంతా అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తుంది.. ఎపిలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.” అంటూ లోకేష్ కామెంట్ చేశారు.  కడపజిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య దారుణ హత్య నేపథ్యంలో ఈ సాయంత్రం లోకేష్, సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పి్ంచారు. పోలీసులు సమయానికి స్పందించి ఉంటే టీడీపీ అధికార ప్రతినిధి హత్య కు గురయ్యేవారు కాదని, చేనేత వర్గానికి చెందిన సుబ్బయ్య ను అతికిరాతకంగా నరికి చంపారని లోకేష్ అన్నారు. సుబ్బయ్య దారుణ హత్య కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు, అతని బావమరిది బంగారు రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాధ్యులని లోకేష్ ఆరోపించారు.