అమ్మాయిలూ అధైర్యపడకండి.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

|

Nov 29, 2019 | 4:50 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యా ఉదంతం పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందనే చెప్పాలి. టోల్ గేట్ దగ్గర్లో తన స్కూటీ పంక్చర్ కావడంతో.. దాన్ని బాగుచేసుకోవాలనే ప్రయత్నంలో ప్రియాంకను మృగాళ్లు కిడ్నాప్ చేయడమే కాకుండా గ్యాంగ్ రేప్ చేసి.. సజీవదహనం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమీషనరేట్.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా.. రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్లు.. తమ వాహనాలు చెడిపోయినా.. […]

అమ్మాయిలూ అధైర్యపడకండి.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి
Follow us on

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యా ఉదంతం పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందనే చెప్పాలి. టోల్ గేట్ దగ్గర్లో తన స్కూటీ పంక్చర్ కావడంతో.. దాన్ని బాగుచేసుకోవాలనే ప్రయత్నంలో ప్రియాంకను మృగాళ్లు కిడ్నాప్ చేయడమే కాకుండా గ్యాంగ్ రేప్ చేసి.. సజీవదహనం చేసిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమీషనరేట్.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా.. రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్లు.. తమ వాహనాలు చెడిపోయినా.. పంక్చర్ అయినా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. వెంటనే తమను సంప్రదించాలంటూ పలు ఫోన్ నెంబర్లను జారీ చేశారు.

ఇక రాచకొండ కమీషనరేట్ తీసుకున్న ఈ నిర్ణయానికి కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుండగా.. హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని మరికొంతమంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా తెలంగాణ డీజీపీ అఫీషియల్ ట్విట్టర్‌కు వెళ్లి.. ఆ ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోండి.