ఢిల్లీ అల్లర్లపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ దిగ్భ్రాంతి, రైతులు తిరిగి సింఘు బోర్డర్ చేరుకోవాలని సూచన

| Edited By: Anil kumar poka

Jan 26, 2021 | 6:14 PM

ఢిల్లీ అల్లర్లపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ విధమైన ఘటనలు జరుగుతాయని తాము ఊహించలేదన్నారు.

ఢిల్లీ అల్లర్లపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ దిగ్భ్రాంతి, రైతులు తిరిగి సింఘు బోర్డర్ చేరుకోవాలని సూచన
Follow us on

ఢిల్లీ అల్లర్లపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ విధమైన ఘటనలు జరుగుతాయని తాము ఊహించలేదన్నారు. ఇది షాకింగ్ న్యూస్ అన్నారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలిపారని, కానీ కొన్ని శక్తులు ఇందులో చేరి ఉండవచ్చ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.  అసలైన అన్నదాతలంతా మళ్ళీ ఢిల్లీ బోర్డర్ చేరుకోవాలని కోరుతున్నా అని అయన ట్వీట్ చేశారు. వారు ట్రాక్టర్ ర్యాలీని శాంతి యుతంగా నిర్వహించినా పరిస్థితి ఇలా ఉద్రిక్తమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్నదాతల నిరసనను పరిగణనలోకి తీసుకుని వారి  డిమాండును సాధ్యమైనంత  త్వరగా తీర్చాలని అమరేందర్ సింగ్ కోరారు.