పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేంద్రం.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లేనట్లే..?

దేశవ్యాప్తంగా ఈ నెల 17న నిర్వహించాల్సిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది.

పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేంద్రం.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లేనట్లే..?

Updated on: Jan 11, 2021 | 8:59 AM

Pulse polio postponed: దేశవ్యాప్తంగా ఈ నెల 17న నిర్వహించాల్సిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు ఆదివారం సమాచారం పంపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆపేయాలని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా విజ‌ృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పల్స్‌ పోలియోను వాయిదా వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Read Also….

సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత.. నివాళ్లులర్పించిన జర్నలిస్ట్ సంఘాలు