మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తల మరో ప్రయోగం.. 17న నింగిలోకి క‌మ్యూనికేష‌న్ శాటిలైట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది.PSLV – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ CMS-01...

మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తల మరో ప్రయోగం.. 17న నింగిలోకి క‌మ్యూనికేష‌న్ శాటిలైట్

Updated on: Dec 13, 2020 | 4:52 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ CMS-01ను PSLV సీ-50 ద్వారా డిసెంబ‌ర్ 17వ తేదీన మ‌ధ్యాహ్నం 3:41 గంట‌ల‌కు నింగిలోకి పంప‌నున్నారు. ఈ ప్రయోగం శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్రయోగ‌ వేదిక‌ నుంచి ప్రయోగించ‌నున్నట్లు ఇస్రో ప్రకటించింది. భారత దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగ పనులు శరవేగంగా జరుగతున్నాయి. షార్ లోని రాకెట్ అనుసంధాన భవనంలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. ఇస్రో ఈ ప్రయోగం ద్వారా 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS 01ను నింగిలోకి చేర్చనుంది. ఈ ఉపగ్రహం మొత్తం బరువు 1410 కిలోలు. ఇది 7 సంవత్సరాల పాటు కక్షలో తిరుగుతూ ఉంటుంది.