ఆర్థిక స్థిరత్వంపై మారటోరియం ప్రభావం..!

|

Aug 06, 2020 | 6:21 PM

బ్యాంక్ లోన్స్ ఈఎంఐ వసూలుపై మారటోరియంను మరింత పొడిగించినా, రుణాలను ఒకసారి రీషెడ్యూల్ చేసినా ఆర్థిక సంస్థలకు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇది దేశ ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.

ఆర్థిక స్థిరత్వంపై మారటోరియం ప్రభావం..!
Follow us on

బ్యాంక్ లోన్స్ ఈఎంఐ వసూలుపై మారటోరియంను మరింత పొడిగించినా, రుణాలను ఒకసారి రీషెడ్యూల్ చేసినా ఆర్థిక సంస్థలకు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇది దేశ ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రుణ గ్రహీతలకు కల్పించిన 6 నెలల మారటోరియం ఆగస్టు 31తో ముగియనుంది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో, బుధవారం ఇక్రా తన నివేదిక విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆ సమయంలో పూర్తిగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రజల ఉద్దీపాన ప్యాకేజీలతో పాటు బ్యాంకుల రుణాలపై ఈఎంఐలపై మారటోరియం విధించింది.

అయితే, ఆర్‌బీఐ ప్రకటించిన ఉపశమనం వల్ల రుణ ఆస్తుల నాణ్యతకు కొంత నష్టభయం ఏర్పడిందని ఇక్రా వెల్లడించింది. మారటోరియం అవకాశాన్ని ఎంచుకున్న ఖాతాదారుల సంఖ్య తక్కువగానే ఉందని బ్యాంకులు ప్రకటించడం కొసమెరుపు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా రుణ పునర్‌వ్యవస్థీకరణపై ఆర్‌బీఐ సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించడం గమనార్హం. అయితే ఇది కొన్ని రంగాలకు పరిమితం కావచ్చనే భావనా ఉంది. కొన్ని రంగాలకు మాత్రమే రుణ పునర్‌వ్యవస్థీకరణ చేయడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పరస్పరం సంబంధం కలిగి ఉండటమే ఇందుకు కారణమని ఇక్రా పేర్కొంది. ఇక, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో వేచిచూడాలి.