ప్రియాంక చోప్రా.. తన అందంతోనే కాక, యాక్టింగ్‌తోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన లైఫ్‌స్టైల్‌ని తానే తీర్చిదిద్దుకున్న గ్రేట్ విమెన్. మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని సొంత చేసుకున్న సౌందర్య రాశి.
బాలీవుడ్లో 50కిపైగా సినిమాల్లో నటించి.. విభిన్న పాత్రలతో మెప్పించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సృష్టించుకున్నారు. హాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ నటుల్లో ప్రియాంక ఒకరు. 2000 సంవత్సరంలో మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌గా గుర్తింపు పొందిన ఈ నటి.. ఆ తర్వాత తన సినీ కెరీర్‌ను ప్రారంభించి గొప్ప విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ప్రియాంకా చోప్రా ఇటీవలే సినీ కెరీర్లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2000 సంవత్సరంలో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నప్పటి వీడియోనూ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఆ సమయంలో తన స్టైల్, నడిచే విధానంపై సరదాగా చమత్కరించారు.