కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. ట్విట్టర్ ద్వారా రాష్ర్టపతి స్పందించారు. కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయిందని అన్నారు.
పార్లమెంటులో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన కూడా ఒకరు. అత్యంత చురుకైన వ్యక్తి అని కొనియాడారు. అణగారినవర్గాల గొంతుక, అట్టడుగున ఉన్నవారికి ఉన్నతికి కృషిచేసిన వ్యక్తి అని అన్నారు. యువతలో ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ సమయంలో జయప్రకాష్ నారాయణ్ సహచర్యం కలిగిన వ్యక్తి అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమించారు. పాశ్వాన్ మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
A firebrand socialist in youth, mentored by the likes of Jayaprakash Narayan during anti-Emergency movement, Paswan ji had enviable rapport with masses and he ardently strove for their welfare. Condolences to his family and supporters.
— President of India (@rashtrapatibhvn) October 8, 2020