ప్రణబ్ ముఖర్జీకి ‘భారత రత్న’ పురస్కారం!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల 8న దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అందుకోబోతున్నారు. ఆయనతోపాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలకు కూడా వారి మరణానంతరం ‘భారత రత్న’ పురస్కారాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలు అందించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో […]

ప్రణబ్ ముఖర్జీకి ‘భారత రత్న’ పురస్కారం!

Edited By:

Updated on: Jul 29, 2019 | 6:52 AM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల 8న దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అందుకోబోతున్నారు. ఆయనతోపాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలకు కూడా వారి మరణానంతరం ‘భారత రత్న’ పురస్కారాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలు అందించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో కొనసాగిన ఆయన కేంద్రంలో రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, న్యాయ శాస్త్రంలో డిగ్రీలు పొందారు.

1935 డిసెంబరు 11న జన్మించిన ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలపాటు రాజకీయ రంగంలో ఉంటూ దేశానికి సేవలందించారు. 2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. 1973లో తొలిసారి ఇందిరా గాంధీ మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టారు. పీ వీ నరసింహా రావు ప్రభుత్వంలో 1991లో ప్రణబ్ ముఖర్జీని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు.