ప్రకాశం జిల్లాలో ఖాకీల కారుణ్యం.. వరదలో చిక్కుకున్న నిండు గర్భిణి.. క్షేమంగా వాగు దాటించిన పోలీసులు..

|

Nov 28, 2020 | 4:40 PM

నిండు గర్భిణి. రేపో, మాపో డెలివరీ. హాస్పిటల్‌కు వెళ్లేందుకు బయలుదేరింది. అంతలోనే పెద్ద నీటి ప్రవాహం... ఏ విధంగా దాటాలో పాలుపోవడం లేదు. అసలే గండం గడిచి పిండం బయటపడటమే ఓ చాలెంజ్ గా మారింది. కానీ, వరద ప్రవాహాన్ని దాటడానికి అంతకంటే ఎక్కువ సాహసమే చేయాల్సి వచ్చింది ఆ నిండు గర్భిణి.

ప్రకాశం జిల్లాలో ఖాకీల కారుణ్యం.. వరదలో చిక్కుకున్న నిండు గర్భిణి..  క్షేమంగా వాగు దాటించిన పోలీసులు..
Follow us on

నిండు గర్భిణి. రేపో, మాపో డెలివరీ. హాస్పిటల్‌కు వెళ్లేందుకు బయలుదేరింది. అంతలోనే పెద్ద నీటి ప్రవాహం… ఏ విధంగా దాటాలో పాలుపోవడం లేదు. అసలే గండం గడిచి పిండం బయటపడటమే ఓ చాలెంజ్ గా మారింది. కానీ, వరద ప్రవాహాన్ని దాటడానికి అంతకంటే ఎక్కువ సాహసమే చేయాల్సి వచ్చింది ఆ నిండు గర్భిణి. ఇంతలో అపద్బంధవుల్లా వచ్చిన పోలీసులు ఆమెను క్షేమంగా ఆస్పత్రికి చేర్చారు.

ప్రకాశం జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న నిండు గర్బిణిని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చారు పోలీసులు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఉప్పుటేరు వరద ప్రవాహంలో పోటెత్తింది. వరదలో చిక్కుకున్న గర్భిణిని గుడ్లూరు పోలీసులు.. ఆ మహిళను సేఫ్‌గా హాస్పిటల్‌కు తరలించారు. అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన వాణిని ప్రసవం కోసం ప్రైవేట్ బస్సులో కందుకూరుకు వెళ్తుంది. ఇంతలో గుడ్లూరు వద్ద వాగులో ఒక్కసారి ప్రవాహం పెరిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయి బస్సు చిక్కుకుపోయింది.

అయితే, ఆ బస్సులో నిండు గర్భిణి అందులో క్షణమొక యుగంగా గడుపుతోంది. వాహనంలో గంట గంట నీరు పెరుగుతోంది. అందులో ఉన్న వారు రక్షించే వారికోసం ఆర్తనాదాలు చేశారు. ఉప్పుటేరుకు అవతలి వైపున ఉన్న పోలీసులు.. గర్భిణీ వాణిని ట్రాక్టర్లో వాగు దాటించారు. గుడ్లూరు ఎస్.ఐ మల్లిఖార్జున, తన సిబ్బంది ట్రాక్టర్ సహాయంతో వాణిని ప్రమాదం నుంచి కాపాడారు. అనంతరం 108 వాహనంలో కందుకూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. దీంతో యువతి క్షేమంగా బయటపడింది. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా పోలీసుల ధైర్యాన్ని పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.