23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇప్పటికీ మకుటం లేని మహారాజు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్‌లో ఈపేరే ఒక బ్రాండ్. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయినా.. ఈయన క్రేజ్‌ ఇప్పటికీ వీరలెవల్. ఆయన నటించిన మొదటి చిత్రం`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` 11 అక్టోబర్ 1996న రిలీజైంది. దాదాపు 23 ఏళ్ళ పాటు టాలీవుడ్‌లో కెరీర్ సాగించిన పవన్ కళ్యాణ్.. అగ్ర కథానాయకుల్లో ఒకరిగా అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌లోని సంపాదించుకున్నారు. ఈయన సినిమా విడుదలైతే చాలు.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ […]

23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇప్పటికీ మకుటం లేని మహారాజు!

Updated on: Oct 12, 2019 | 2:54 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్‌లో ఈపేరే ఒక బ్రాండ్. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయినా.. ఈయన క్రేజ్‌ ఇప్పటికీ వీరలెవల్. ఆయన నటించిన మొదటి చిత్రం`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` 11 అక్టోబర్ 1996న రిలీజైంది. దాదాపు 23 ఏళ్ళ పాటు టాలీవుడ్‌లో కెరీర్ సాగించిన పవన్ కళ్యాణ్.. అగ్ర కథానాయకుల్లో ఒకరిగా అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌లోని సంపాదించుకున్నారు. ఈయన సినిమా విడుదలైతే చాలు.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత తెలుగు చిత్రసీమలో మళ్ళీ ఆ స్థానం అందుకున్నది పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు. అన్న పిస్టల్‌తోనే ఆత్మహత్య చేసుకోవాలన్నంత డిప్రెషన్‌‌ను జయించి.. ఎంతో స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన పవన్ గురించి మెగా ఫ్యాన్స్‌లో ఇప్పటికీ చర్చ సాగుతుంటుంది. అనుకోని విధంగా సినిమాల్లోకి ప్రవేశించినా… చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలన్న సిద్ధాంతంతో ఎవరికి అందనంత స్థాయికి ఎదిగారు.

పవన్ సినీ కెరీర్ ఒక ఎత్తయితే.. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం మరో ఎత్తు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వెండితెరపై మకుటం లేని మహరాజులా వెలిగిన పవన్ కళ్యాణ్‌కు.. మొదటిలోనే ఘోర పరాభవం ఎదురైంది. అయినా తొణకలేదు. ప్రజలకు సాయం చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. ఏపీ రాజకీయాల్లో విపక్ష పాత్రను పోషిస్తున్నారు. ఎక్కడ కష్టం వచ్చినా.. మొదటిగా నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గళం ఎత్తుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. 23 ఏళ్ళ సినీ కెరీర్‌లో పవన్ కళ్యాణ్ చేసింది కేవలం 25 చిత్రాలు మాత్రమే. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే కౌంట్ తక్కువే.. కానీ ఫాలోయింగ్ పీక్స్. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్.. తొందర్లోనే సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన నటించడానికి ఓకే అంటే.. సినిమాను నిర్మించడానికి అనేకమంది నిర్మాతలతో పాటుగా కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత హీరో రామ్ చరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక అన్న మెగాస్టార్ చిరంజీవి అయితే.. తమ్ముడు సై అంటే.. నేను ఎవర్ రెడీ అన్నారు. చూడాలి మరి అభిమానుల ఆకాంక్ష మేరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తారో.. లేక ప్రజాసేవకే జీవితాన్ని అంకితమిస్తారో.