
దువ్వాడ జగన్నాథమ్(డీజే) బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథమ్. ఇది తెరకెక్కి మూడేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే తన అల్బమ్‌లో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అందులోని రెండు ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మొదటి ఫోటోలో పూజా హెగ్డే నుదిటిపై బన్నీ విభూతి రాస్తున్నది కాగా… రెండో ఫోటో.. ఓ పాటకు పూజా, అర్జున్ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు చేస్తున్నారు. ఈ ఫోటోలో ఇద్దరూ పంచెకట్టులో మెరిసిపోయారు.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలకు “సూపర్ స్పెషల్ టీం”తో పని చేయాలనుకుంటున్నానని పూజాహెగ్డే క్యాప్షన్ ఇచ్చారు. ఇదిలావుంటే… ఇటీవల ‘అల వైకుంఠపురం’లో సినిమా ద్వారా బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే. ఇందులోని పాటలన్నీ బంపర్ హిట్టు కొట్టాయి. ‘బుట్టబొమ్మ’ పాట ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన పూజా హెగ్డే ప్రస్తుతం బాహుబలి ప్రభాస్ సరసన నటిస్తోంది.