కాలినడకన బద్రీనాథ్‌కు మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక సందర్శన యాత్ర ఉత్తరఖండ్‌లో కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బద్రినాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ప్రధాని రాకతో అధికారులు కేథారినాథ్, బద్రీనాథ్ ఆలయాలతో పాటు హిమాలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్రలో భాగంగానే మోదీ అత్యంత స్వల్ప భద్రత నడుమ హిమాలయాల్లోని బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కాలినడక ద్వారా బండరాళ్లు పరుచుకున్న మార్గం గుండానే మోదీ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు. శనివారం మహాశివుడ్ని దర్శించుకున్న మోదీ ఇవాళ బద్రీనాథ్ ఆలయానికి […]

కాలినడకన బద్రీనాథ్‌కు మోదీ..

Edited By:

Updated on: May 19, 2019 | 2:34 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక సందర్శన యాత్ర ఉత్తరఖండ్‌లో కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బద్రినాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ప్రధాని రాకతో అధికారులు కేథారినాథ్, బద్రీనాథ్ ఆలయాలతో పాటు హిమాలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాత్రలో భాగంగానే మోదీ అత్యంత స్వల్ప భద్రత నడుమ హిమాలయాల్లోని బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కాలినడక ద్వారా బండరాళ్లు పరుచుకున్న మార్గం గుండానే మోదీ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు. శనివారం మహాశివుడ్ని దర్శించుకున్న మోదీ ఇవాళ బద్రీనాథ్ ఆలయానికి చేరుకొని.. నారాయణుడికి ప్రత్యేక పూజలు చేశారు. బద్రీనాథ్ పర్యటన ముగించుకొని ప్రధాని ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.