అత్యాధునిక బైక్ పై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే…వాహ్ !

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 12:51 PM

భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డేకి మోడరన్ బైక్ లంటే చాలా క్రేజ్ అన్న విషయం వెల్లడయింది. అత్యాధునిక హార్లే డేవిడ్ సన్ సూపర్ బైక్ పై ఆయన కూర్చున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి..

అత్యాధునిక బైక్ పై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే...వాహ్ !
Follow us on

భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డేకి మోడరన్ బైక్ లంటే చాలా క్రేజ్ అన్న విషయం వెల్లడయింది. అత్యాధునిక హార్లే డేవిడ్ సన్ సూపర్ బైక్ పై ఆయన కూర్చున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తనకు ఓ బుల్లెట్ వాహనం ఉందని ఆయన  గతంలో తెలిపారు. తానుంటున్న నాగపూర్ లోని ఇంటివద్ద బాబ్డే ఇలా ఈ బైక్ మీద కూర్చుని అందరికీ ఆసక్తిని రేకెత్తించారు. ఈ ఫోటోలు బాగానే ఉన్నా.. ఆయన  ఫేస్ మాస్క్ ధరించలేదని అప్పుడే నెటిజన్లు కస్సుమంటున్నారు. ఈ కరోనా కాలంలో ఇలా వితౌట్ మాస్క్ తో కనిపించవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. ‘ది గార్డియన్ ఆఫ్ లా.. ఆర్.. లా బ్రేకర్ ? నో మాస్క్.. నో హెల్మెట్..’ (చట్ట పరిరక్షకుడా లేక చట్ట ఉల్లంఘనులా ? మాస్క్ లేదు.. హెల్మెట్ లేదు) అని కొందరు పెదవి విరిచారు. తనకు బైక్ లంటే చాలా ఇష్టమని, ఒకసారి యాక్సిడెంట్ అయిన కారణంగా కొన్ని రోజులు కోర్టుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని జస్టిస్ బాబ్డే లోగడ ఓ సందర్భంలో తెలిపారు. ఈ కరోనా ఎపిడమిక్ కాలంలో జడ్జీలు నల్లకోట్లు ధరించే బదులు.. నెక్ బ్యాండ్ తో ప్లెయిన్ వైట్ షర్టులు ధరించాలని ఆయన ఇటీవల సూచించారు.