వరుసగా ఐదో రోజు.. పెట్రోల్, డీజల్ ధరలు పైపైకి..

వరుసగా ఐదో రోజు మెట్రో నగరాల్లో డీజల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. మరోసారి డీజల్, పెట్రోల్‌పై 60 పైసల చొప్పున వడ్డించారు. దాదాపు 12 వారాల షట్‌డౌన్‌ అనంతరం చమురు సంస్థలు..

వరుసగా ఐదో రోజు.. పెట్రోల్, డీజల్ ధరలు పైపైకి..

Updated on: Jun 11, 2020 | 1:41 PM

వరుసగా ఐదో రోజు మెట్రో నగరాల్లో డీజల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్‌డౌన్‌ అనంతరం చమురు సంస్థలు మళ్లీ సాధారణ స్థాయికి వచ్చినప్పటికీ మరోసారి డీజల్, పెట్రోల్‌పై 60 పైసల చొప్పున వడ్డించారు. ఇవాళ ఉదయం నుంచి ఈ పెరిగిన రేట్లు అమలులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 74 కాగా, డీజల్ రూ. 72.22కు చేరింది. కాగా, అంతర్జాతీయ చమురు ధరలు గురువారం 2 శాతానికి పైగా పడిపోయాయి. ముడి చమురు కోసం ప్రపంచ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.2 శాతం పడిపోయి బ్యారెల్‌కు 40.81 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు రోజు నమోదైన లాభాలన్నింటినీ కూడా వదులుకుంది.

మెట్రో నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి…

  • ఢిల్లీ – పెట్రోల్ రూ. 74, డీజిల్ రూ. 72.22
  • కోల్‌కతా – పెట్రోల్ రూ. 75.94, డీజిల్ రూ. 68.17
  • ముంబై – పెట్రోల్ రూ. 80.98, డీజిల్ రూ. 70.92
  • చెన్నై – పెట్రోల్ రూ. 77.96, డీజిల్ రూ. 70.64