సంచలనం : నిర్మలాసీతారామన్ కు భర్త పరకాల స్ట్రాంగ్ కౌంటర్

|

Sep 03, 2020 | 5:36 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ పెద్ద సంచలనానికే తెరతీశారు. ఇంతకాలం నిశ్శబ్ధంగా ఉన్న ఆయన ఒక్కసారిగా తన మాటల తూటాల్ని బయటకు వదిలారు. సరాసరి తన భార్య అన్న మాటలపైనే..

సంచలనం : నిర్మలాసీతారామన్ కు భర్త పరకాల స్ట్రాంగ్ కౌంటర్
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ పెద్ద సంచలనానికే తెరతీశారు. ఇంతకాలం నిశ్శబ్ధంగా ఉన్న ఆయన ఒక్కసారిగా తన మాటల తూటాల్ని బయటకు వదిలారు. సరాసరి తన భార్య అన్న మాటలపైనే సెటైర్లు వేశారు. ఇప్పుడు పరకాల మాటలు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై విమర్శిస్తూ ట్వీట్ చేసిన పరకాల.. సూక్ష్మ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ఆలోచనలు లేకపోవడమే యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారంటూ విమర్శించారు. కోవిడ్ అన్నది తర్వాత వచ్చిందని, తాను 2019 అక్టోబర్లోనే చెప్పానని, ప్రభుత్వం ఖండించడం వల్లనే 23.9% వృద్ధి రేటు మందగించిందని వెల్లడించారు. ఇప్పటికైనా ఏదో ఒకటి చేయండంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే, పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై అనేక రకాల విశ్లేషణలు మొదలైపోయాయి. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశమైంది.