కేంద్ర మంత్రి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాక్‌

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి చెందిన వ్యక్తి గత వెబ్ సైట్‌పై దాడి చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్‌ ఈ కుట్రకు పాల్పడినట్లు..

కేంద్ర మంత్రి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాక్‌
Follow us

|

Updated on: Aug 25, 2020 | 6:04 PM

మరోసారి హ్యాకర్లు రెచ్చిపోయారు. ప్రముఖ కంపెనీలను టార్గెట్ చేసే హాకర్లు.. ఈ సారి కేంద్ర మంత్రిని  లక్ష్యంగా చేసుకున్నారు. అది కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి చెందిన వ్యక్తి గత వెబ్ సైట్‌పై దాడి చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్‌ ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆగస్ట్‌ 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయని గమనించిన సిబ్బంది వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారించింది. అయితే అది వ్యక్తిగత వెబ్‌సైట్‌ కావడంతో దేశ భద్రతకు సంబంధిచిన ఎలాంటి సమాచారం అందులో లేదని అన్నారు. కేవలం పార్టీ, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇందులో ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.