
Babar Azam In T20’s: అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. తక్కువ వ్యవధిలోనే మేటి ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆజామ్ చోటు సంపాదించుకున్నాడు. తాజాగా బాబర్ అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో తనదైన శైలి ఆటతీరుతో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా టీ20ల్లో అయితే పరుగుల వరద పారిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్‌లో బాబర్ ఆజామ్(869) టాప్ ప్లేస్ చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్(824) రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మూడో స్థానంలో ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 673 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. అటు బౌలర్లు, ఆల్ రౌండర్ల లిస్టులో ఆఫ్ఘానిస్తాన్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..