చెనీస్ వివాదాస్పద అప్లికేషన్ టిక్‌టాక్‌పై పాకిస్థాన్ బ్యాన్ ఎత్తివేసింది. అనైతిక కంటెంట్‌ను నియంత్రిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతే పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) టిక్‌టాక్‌ను అన్‌బ్లాక్ చేసింది.
అనైతిక, అసభ్యకర కంటెంట్‌కు వ్యతిరేకంగా వివిధ వర్గాల నుంచి కంప్లైంటులు అందిన నేపథ్యంలో అక్టోబర్ 9న టిక్‌టాక్‌పై పీటీఏ బ్యాన్ చేస్తూ పాకిస్థథాన్ సంచలన నిర్ణయం తీసుకంది. నోటీసులపై స్పందించేందుకు కావాల్సిన సమయం ఇచ్చినా.. ఆ సంస్థ పూర్తి రూల్స్ పాటించక విఫలమైందని అప్పట్లో పేర్కొంది. కాగా పాక్‌లో టిక్‌టాక్‌కు మంచి ప్రాచుర్యం లభించింది. ఆ దేశంలో యాప్ డౌన్లోడ్లు 4.3 కోట్లు దాటాయి. 2020 సంవత్సరంలోనే 1.47 కోట్ల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
Also Read : జగన్ సాయం కోరిన కేసీఆర్, వెంటనే స్పందించిన ఏపీ సీఎం