డ్రోన్ల సాయంతో కుట్ర పన్నుతున్న పాకిస్తాన్

|

Aug 24, 2020 | 2:02 PM

ప్రపంచ దేశాల హెచ్చరించిన పాక్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడంలేదు. చీటికి మాటికి భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా, సాంబ సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బాంబు దాడి చేసేందుకు పాకిస్థాన్‌ కుట్రను రచిస్తోందని తెలుస్తోంది.

డ్రోన్ల సాయంతో కుట్ర పన్నుతున్న పాకిస్తాన్
Follow us on

ప్రపంచ దేశాల హెచ్చరించిన పాక్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడంలేదు. చీటికి మాటికి భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా, సాంబ సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బాంబు దాడి చేసేందుకు పాకిస్థాన్‌ కుట్రను రచిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తరుచూ డ్రోన్లను వాడుకోవాలని ఫ్లాన్ చేస్తోందంటున్నారు బీఎస్ఎఫ్‌ నిఘా వర్గాలు. భారత్‌లోకి డ్రగ్స్‌, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా డ్రోన్ల సాయంతో తీసుకొచ్చేందుకు పాక్‌ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పథకం రచించినట్లు సమాచారం.

భారత్‌లోకి వచ్చేందుకు శనివారం యత్నించిన ఐదుగురు చొరబాటుదారులపై బలగాలు కాల్పులు జరిపాయి. పాకిస్థాన్‌ నుంచి పంజాబ్‌లో టార్న్‌ తరణ్‌ జిల్లాలో చొరబడేందుకు వారు యత్నించారని, ప్రశ్నించేందుకు యత్నించగా కాల్పులు తెగబడ్డారని బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మరణించగా.. రెండు మృతదేహాలను, ఒక రైఫిల్‌ను స్వాధీనపరచుకున్నామని పేర్కొన్నారు. మూడో మృతదేహం కోసం గాలింపు చేపట్టాయి భద్రతా దళాలు. ఇది దేశ రాజధానిలో ఐఎస్ఐఎస్ ఎజెంట్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో సరిహద్దులో అలజడి రేగడం విశేషం.

ఇదిలావుంటే, ఈ ఏడాది జూన్‌ 20న ఒక పాకిస్థాన్‌ డ్రోన్‌ను సరిహద్దు భద్రత బలగాలు నేలకూల్చిన ఘటన అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఆ డ్రోన్‌లో అత్యాధునిక రైఫిల్‌తో పాటు రెండు మ్యాగజీన్లు, 7 గ్రెనేడ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిని కశ్మీర్‌లోని పాకిస్థానీ ఏజెంట్లకు డెలివరీ చేసేందుకు పాక్‌ ఆర్మీ యత్నించినట్లు ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. 2019లో పంజాబ్‌ పోలీసులు కూడా కొన్ని పాక్‌ డ్రోన్లను స్వాధీనపరచుకున్నారు. భారత్‌ సైనిక సంపత్తి ముందు తేలిపోతున్న పాక్‌, మున్ముందు ఇలా డ్రోన్ల సాయంతోనే దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించవచ్చని నిపుణులు చెబుతున్నారు.