సిలిండర్ పేలి తగలబడ్డ రైలు.. మృతుల్లో హైదరాబాదీయులు..!

పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. సిలిండర్ పేలి రైలు తగలబడింది. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందగా.. 20మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తోన్న టెజ్గమ్ అనే రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తోన్న ప్రయాణికులు వంట చేసుకున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ఆ దేశ రైల్వే శాఖ అభిప్రాయపడుతోంది. మరణించిన వారిలో 16మృతదేహాలు గుర్తుపట్టని రీతిలో […]

సిలిండర్ పేలి తగలబడ్డ రైలు.. మృతుల్లో హైదరాబాదీయులు..!

పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. సిలిండర్ పేలి రైలు తగలబడింది. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందగా.. 20మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తోన్న టెజ్గమ్ అనే రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తోన్న ప్రయాణికులు వంట చేసుకున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ఆ దేశ రైల్వే శాఖ అభిప్రాయపడుతోంది. మరణించిన వారిలో 16మృతదేహాలు గుర్తుపట్టని రీతిలో ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మూడు బోగీలు దగ్ధమయ్యాయని.. అందులో ఎక్కువగా పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రయాణికులే ఉన్నారని వారు వెల్లడించారు. తల్వారీ రైల్వే స్టేషన్ దాటిన తరువాత లియాఖత్‌పూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.