స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకే మద్ధతు ధర నిర్ణయించాలిః అజాద్

|

Sep 22, 2020 | 11:25 AM

కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు సీరియస్ అవుతున్నాయి. వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకే మద్ధతు ధర నిర్ణయించాలిః అజాద్
Follow us on

కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు సీరియస్ అవుతున్నాయి. వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. ఆదివారం రోజున బిల్లుల‌ను అడ్డుకున్న 8 మంది విప‌క్ష ఎంపీల‌పై వేటు వేశారు. దీంతో పార్ల‌మెంట్‌ అవరణలో ధ‌ర్నాకు దిగారు ఎంపీలు. దీంతో ఇవాళ కూడా రాజ్యస‌భ‌లో ర‌భ‌స కొన‌సాగింది. గ‌త రెండు రోజుల నుంచి స‌భ‌లో జ‌రుగుతున్న తీరు సరిగాలేదని ప్ర‌తిప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ మండిపడ్డారు. స‌రిహ‌ద్దుల్లో పోరాటం త‌ర‌హాలో స‌భ‌లో ప్ర‌తి నిమిషం ప్ర‌జ‌ల కోసం పోరాడుతామ‌న్నారు. ఎనిమిది మంది ఎంపీల‌పై విధించిన వేటును ఎత్తివేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు. తమ 3 డిమాండ్లను అంగీకరించే వరకు పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తులు కనీస మద్దతు ధరకంటే తక్కువకు పంటకొనుగోలుకు వీల్లేకుండా కేంద్రం మరో బిల్లు తీసుకురావాలని ఆజాద్ తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం కనీస మద్ధతు ధర నిర్ణయించాలని ఆయన కోరారు. రాజ్య‌స‌భ‌లో వ్యవసాయ బిల్లులు పాసైన తీరు ప‌ట్ల విపక్ష పార్టీల ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.