ఈ ఏడాది 4 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు..

|

May 15, 2020 | 2:53 PM

వర్షాలొస్తే ఖరీఫ్​ పంట వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు‌ రైతులు. అయితే, ఈ ఏడాది వానలు ఓ నాలుగు రోజులు ఆలస్యంగా కురవనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను రుతుపవనాల ఎప్పుడైతే తాకుతాయో …అప్పుడు దేశంలో నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈసారి కేరళను రుతుపవనాలు జూన్​ 5న పలకరించనున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. “ఈసారి కేరళను నైరుతి రుతుపవనాలు ప్రతి ఏడాది కంటే కాస్త ఆలస్యంగా తాకనున్నాయి. కేరళలో జూన్​ […]

ఈ ఏడాది 4 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు..
Follow us on

వర్షాలొస్తే ఖరీఫ్​ పంట వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు‌ రైతులు. అయితే, ఈ ఏడాది వానలు ఓ నాలుగు రోజులు ఆలస్యంగా కురవనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను రుతుపవనాల ఎప్పుడైతే తాకుతాయో …అప్పుడు దేశంలో నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈసారి కేరళను రుతుపవనాలు జూన్​ 5న పలకరించనున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.

“ఈసారి కేరళను నైరుతి రుతుపవనాలు ప్రతి ఏడాది కంటే కాస్త ఆలస్యంగా తాకనున్నాయి. కేరళలో జూన్​ 5కు కాస్త‌ అటూఇటుగా వర్షాలు ప్రారంభం కానున్నాయి” అని భారత వాతావరణ శాఖ తెలిపింది.