వింత : బంజారాహిల్స్‌లో నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర నగలు.!

హైదరాబాద్‌లో వింతైన ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లో కిలోన్నర నగలు గల్లంతయ్యాయి. ఒక కస్టమర్ కోసం బషీర్ బాగ్ లో ఉన్న ‘విఎస్ గోల్డ్ జువెలర్స్’ నుండి జూబ్లీహిల్స్ లోని ‘కృష్ణా పెరల్స్’ షాపుకు నగలు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రదీప్ అనే సేల్స్ మెన్ బంగారాన్ని టూ వీలర్ పై తరలిస్తున్న క్రమంలో నగల సంచి భారీ వర్షంతో కూడిన వరద నీటిలో కొట్టుకుపోయినట్టు ప్రదీప్ చెబుతున్నాడు. దీంతో, నగలకోసం షాపు సిబ్బంది రాత్రంతా గాలించగా […]

వింత : బంజారాహిల్స్‌లో నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర నగలు.!

Updated on: Oct 13, 2020 | 11:35 AM

హైదరాబాద్‌లో వింతైన ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లో కిలోన్నర నగలు గల్లంతయ్యాయి. ఒక కస్టమర్ కోసం బషీర్ బాగ్ లో ఉన్న ‘విఎస్ గోల్డ్ జువెలర్స్’ నుండి జూబ్లీహిల్స్ లోని ‘కృష్ణా పెరల్స్’ షాపుకు నగలు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రదీప్ అనే సేల్స్ మెన్ బంగారాన్ని టూ వీలర్ పై తరలిస్తున్న క్రమంలో నగల సంచి భారీ వర్షంతో కూడిన వరద నీటిలో కొట్టుకుపోయినట్టు ప్రదీప్ చెబుతున్నాడు. దీంతో, నగలకోసం షాపు సిబ్బంది రాత్రంతా గాలించగా సంచిమాత్రం దొరికిందని షాపు యజమాని తెలిపారు. సంచిలో నగలు మాయం కావడంతో బంజారాహిల్స్ పోలీసులకు షాపు ఓనర్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సేల్స్ మెన్ ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రదీప్ సంచరించిన పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us