నేషనల్ ప్లేయర్స్..ఇదేనా సభ్యసమాజానికి మీరిచ్చే మెసేజ్…

|

Nov 26, 2019 | 1:34 PM

నేషనల్ ప్లేయర్స్ స్థాయి మరిచి బిహేవ్ చేశారు. గ్రౌండ్‌లోనే హాకి స్టిక్స్‌తో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ సదరు ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెహ్రూ హాకీ కప్‌ టోర్నమెంట్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌ పోలీస్‌ జట్టు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జట్టు మధ్య ఈ గొడవ జరిగింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపును ప్రస్టేజ్‌గా తీసుకున్నాయి. హోరాహోరిగా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ఇరు జట్ల పాయింట్లు […]

నేషనల్ ప్లేయర్స్..ఇదేనా సభ్యసమాజానికి మీరిచ్చే మెసేజ్...
Follow us on

నేషనల్ ప్లేయర్స్ స్థాయి మరిచి బిహేవ్ చేశారు. గ్రౌండ్‌లోనే హాకి స్టిక్స్‌తో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ సదరు ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెహ్రూ హాకీ కప్‌ టోర్నమెంట్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌ పోలీస్‌ జట్టు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జట్టు మధ్య ఈ గొడవ జరిగింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపును ప్రస్టేజ్‌గా తీసుకున్నాయి. హోరాహోరిగా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ఇరు జట్ల పాయింట్లు ఒకానొక సమయంలో టై అయ్యాయి.  ఈ టైం లో తీవ్ర భావోద్వేగానికి లోనైన ప్లేయర్లు ముందు మాటలు విసురుకున్నారు. అవి కాస్తా శృతి మించడంతో కొట్లాట వరకు వెళ్లింది. హాకి స్టిక్స్‌ చేతిలో ఉండటంతో ప్లేయర్స్‌ని కంట్రోల్ చెయ్యడానికి చాలా టైం పట్టింది.

దీంతో టోర్నీ మేనేజ్‌మెంట్ ఇరు వర్గాలకు నచ్చజెప్పి మ్యాచ్ కంటిన్యూ చేయించింది. చివరకు పీఎన్‌బీ 6-3 తేడాతో పంజాబ్‌ పోలీస్‌ జట్టుపై విజయం సాధించింది. కాగా గొడవపై నేషనల్ హాకి ఫెడరేషన్ సీరియస్ అయ్యింది. వెంటనే పూర్తి దర్యాప్తుతో కూడిన నివేదిక అందించాలని టోర్నీ నిర్వాహకులను ఆదేశించింది.