Omicron Threat: కోనసీమలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. బంగ్లాదేశ్ నుండి అయినవిల్లి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. తాజాగా సింగపూర్ నుంచి రావులపాలెం వచ్చిన భార్యభర్తలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణఅయింది.. టీవీ9 కథనాలతో విదేశాలనుంచి వచ్చి కోవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. అప్రమత్తమైన అధికారులు అయినవిల్లి మండలం సిరిపల్లి లో శానిటేషన్ చేయించారు.
ప్రశాంతంగా ఉండే కోనసీమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోనసీమలో అయినవిల్లి తో పాటు రావులపాలెం లో సింగపూర్ నుండి వచ్చిన భార్య భర్తలకు కూడా కరోనా సోకింది… వీళ్ల ముగ్గురి శాంపిల్స్ C C M B పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరిగిందని చెప్పారు.
అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామానికి చెందిన యువకుడు బంగ్లాదేశ్ నుండి రావడంతో అతనికి కోవిడ్ టెస్ట్ నిర్వహించారు..అతని టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్‌గా రావటంతో…ఒక్కసారిగా అంతా హడలెత్తిపోయారు…డిసెంబర్ 8వ తేదీన బంగ్లాదేశ్ నుండి అయినవిల్లి వచ్చిన యువకుడికి, అయినవిల్లిలో phc అధికారులు కోవిడ్ టెస్టు నిర్వహించారు. టెస్టులో కరోనా పాజిటివ్ రావడం తో అందరూ కంగారు పడ్డారు.. దింతో అతనికోసం పోలీసులు గాలించి పట్టుకుని హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. అతని వద్ద నుండి శాంపిల్స్ తీసి హైదరాబాద్ సీసీఎంబీ పరీక్షలకు పంపారు. దీనిపై టీవీ9 వరుస కధనాలు ప్రచారం చేయడంతో అడిషనల్ డి.ఎమ్.హెచ్.ఓ మీనాక్షి స్పందించారు.
చైనా, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఇటలీ తదితర 12 దేశాల నుంచి జిల్లాలో డిసెంబర్ 1st నుంచి ఇప్పటి వరకు 2746 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చారని తెలిపారు. ఎవరికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. ఎవరైనా విదేశాలనుంచి వస్తే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Also Read: శ్రీవారి సేవలో బాలయ్య, బోయపాటి.. అఖండ సినిమాతో ఇండస్ట్రీకి ప్రేక్షకులు ఊపిరిపోశారన్న బాలకృష్ణ..