హ్యాట్సాఫ్..8 నెల‌ల గ‌ర్భంతో విధుల్లోకి ఎస్సై..

| Edited By:

Apr 23, 2020 | 10:18 PM

కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు..లాక్ డౌన్ స‌క్ర‌మంలా అమ‌లు ప‌రిచేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు ముందువ‌ర‌స‌లో ఉండి అనేక క‌ష్టన‌ష్టాల‌కోర్చి విధులు నిర్వ‌రిస్తున్నారు. అందునా ఒడిశాలో ఓ మహిళా సబ్​ఇన్​స్పెక్టర్​ యావ‌త్ పోలీస్ డిపార్ట్ మెంట్ గ‌ర్వ‌ప‌డేలా చేసింది. 8 నెలల గర్భంతో ఉన్నా డ్యూటి చేస్తోంది. ఒడిశా మయూరభంజ్​ జిల్లా బేతానాటి పీఎస్ లో మహిళా సబ్​ఇన్​స్పెక్టర్​ మమతా మిశ్రా 8 నెలల గర్భిణి. కరోనా మహమ్మారి వీర‌విహారం చేస్తోన్న స‌మ‌యంలో మమతా […]

హ్యాట్సాఫ్..8 నెల‌ల గ‌ర్భంతో విధుల్లోకి ఎస్సై..
Follow us on

కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు..లాక్ డౌన్ స‌క్ర‌మంలా అమ‌లు ప‌రిచేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు ముందువ‌ర‌స‌లో ఉండి అనేక క‌ష్టన‌ష్టాల‌కోర్చి విధులు నిర్వ‌రిస్తున్నారు. అందునా ఒడిశాలో ఓ మహిళా సబ్​ఇన్​స్పెక్టర్​ యావ‌త్ పోలీస్ డిపార్ట్ మెంట్ గ‌ర్వ‌ప‌డేలా చేసింది. 8 నెలల గర్భంతో ఉన్నా డ్యూటి చేస్తోంది.

ఒడిశా మయూరభంజ్​ జిల్లా బేతానాటి పీఎస్ లో మహిళా సబ్​ఇన్​స్పెక్టర్​ మమతా మిశ్రా 8 నెలల గర్భిణి. కరోనా మహమ్మారి వీర‌విహారం చేస్తోన్న స‌మ‌యంలో మమతా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా విధులకు హాజరవుతున్నారు. ఇటీవ‌లే మయూరభంజ్​ను సందర్శించిన ఒడిశా డీజీపీ అభయ్​ ఈ విషయాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఇటువంటి విప‌త్క‌ర‌ పరిస్థితుల్లో కడుపులో బిడ్డను మోస్తూ విధులకు హాజరైన మమత ధైర్యసాహసాలను ఆయ‌న ప్ర‌శంసించారు.