దేశ ఆర్థికాభివృధ్ది ప్లాన్ అమలులో పొరబాట్లు చేశా, కిమ్ ఒప్పుకోలు, విశ్లేషణ చేసుకుంటున్నా నంటూ ఆవేదన

| Edited By: Anil kumar poka

Jan 06, 2021 | 12:26 PM

దేశ ఆర్థికాభివృద్దికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో పొరబాట్లు చేశానని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించారు.

దేశ ఆర్థికాభివృధ్ది ప్లాన్ అమలులో పొరబాట్లు చేశా, కిమ్ ఒప్పుకోలు, విశ్లేషణ చేసుకుంటున్నా నంటూ ఆవేదన
North Korea's Kim Jong un (File Photo)
Follow us on

దేశ ఆర్థికాభివృద్దికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో పొరబాట్లు చేశానని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించారు. ఇంచుమించు అన్ని రంగాలలోనూ ఎకనామిక్ డెవలప్ మెంట్ ప్లాన్ విఫలమవుతూ వచ్చిందన్నారు. సియోల్ లో పాలక వర్కర్స్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన..ఇలా నిరాశాజనకంగా మాట్లాడుతూ..జరిగిన పొరబాట్లకు, తప్పిదాలకు విశ్లేషణ చేసుకోవలసి ఉందన్నారు. దాదాపు అన్ని రంగాల్లో మన లక్ష్యాల సాధనలో చాలావరకు ఫెయిల్ అయ్యామని భావిస్తున్నానని, ఇప్పటికైనా కనువిప్పు కలిగిందని అన్నారు. ఐదేళ్లలో పాలక వర్కర్స్ పార్టీ అరుదుగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. జో బైడెన్ అమెరికా అధ్యక్షపదవిని చేబట్టడానికి కొన్ని రోజులముందు ఈ పార్టీ సమావేశం కావడం గమనార్హం. కిమ్, డోనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలు జరిగిన అనంతరం అమెరికా, నార్త్ కొరియా మధ్య సంబంధాలలో ప్రతిష్టంభన ఏర్పడింది. కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి సరిహద్దులను మూసివేయడంతో నార్త్ కొరియా ఏకాకి అయింది. కాగా కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి 7 వేలమంది హాజరయ్యారు.
Also read :