కృత్రిమ సూర్యుడిని సిద్ధం చేసిన దక్షిణి కొరియా.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన శాస్త్రవేత్తలు.. దీని ప్రత్యేకతలు ఏంటంటే?

ప్రపంచ దేశాలన్ని ఇప్పుడు కృత్రిమ సూర్యుడిని సృష్టించే పనిలో పడ్డాయి. దీనికోసం విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు. చైనా ఇటీవలే

కృత్రిమ సూర్యుడిని సిద్ధం చేసిన దక్షిణి కొరియా.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన శాస్త్రవేత్తలు.. దీని ప్రత్యేకతలు ఏంటంటే?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 30, 2020 | 1:54 PM

ప్రపంచ దేశాలన్ని ఇప్పుడు కృత్రిమ సూర్యుడిని సృష్టించే పనిలో పడ్డాయి. దీనికోసం విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు. చైనా ఇటీవలే న్యూక్లియర్ ల్యాబ్‌లో ఓ కృత్రిమ సూర్యుడిని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిని ‘హెచ్ఎం2 టోకామర్ రియాక్టర్’ అని పిలుస్తుండగా.. ఇది సూర్యుడి కంటే అధిక శక్తిని, వేడిని విడుదల చేస్తుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు.

అయితే ఇప్పుడు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కూడా కేస్టార్(KSTAR) అనే కృత్రిమ సూర్యుడిని సృష్టించారు. అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. నిజానికి సూర్యుడిలోని ఉష్ణోగ్రతలు 1.5 కోట్ల డిగ్రీలకు పరిమితం కాగా, కేస్టార్‌లో మాత్రం 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలను 20 సెకన్ల పాటు కొనసాగించి దక్షిణి కొరియా శాస్ర్తవేత్తలు ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ, అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ ప్రయోగం చేపట్టగా, దక్షిణ కొరియాలోని ‘కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ’లో ఈ ప్రయోగం నిర్వహించారు. ఇంతకంటే ముందు 100 మిలియన్ డిగ్రీల వేడిని పుట్టించినా, 10 సెకన్ల కన్నా ఎక్కువ సమయం కొనసాగలేదు. దాంతో గత ప్రయత్నాలతో పోలిస్తే, ఇది గణనీయమైన మెరుగుదలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.