42 మందికి కరోనా.. మూతపడ్డ నోకియా ప్లాంట్‌..

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. తమిళనాడులో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో మహారాష్ట్ర అనంతరం అత్యధిక కేసులు

42 మందికి కరోనా.. మూతపడ్డ నోకియా ప్లాంట్‌..

Updated on: May 27, 2020 | 1:38 PM

Nokia Shuts Plant: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. తమిళనాడులో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో మహారాష్ట్ర అనంతరం అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 646 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిద్-19 కేసుల సంఖ్య 17,728కి చేరగా వీరిలో ఇప్పటి వరకు 127మంది మృత్యువాతపడ్డారు.

కాగా. నోకియా కంపెనీలో మొత్తం 42 మంది ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకిందని తేలడంతో, తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఉన్న నోకియా ప్లాంట్‌ను మూసివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులతో ఈ ప్లాంట్‌ గత కొన్నిరోజుల క్రితమే తిరిగి తెరచుకుంది. భారీ సంఖ్యలో కేసులు బయటపడడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టామని సంస్థ ప్రకటించింది.

మరోవైపు.. ఢిల్లీ శివారులో ఉన్న ఒప్పో మొబైల్‌ కంపెనీలో తొమ్మిది మందికి వైరస్‌ సోకడంతో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసింది. లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చిన అనంతరం.. కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తుల్లో వైరస్‌ బయటపడుతుండడం, వాటిని ఎదుర్కోవడం కంపెనీలకు ఒక సవాలుగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us