Godavari Boat Accident: ఆ బోటుకు అనుమతి లేదు: మంత్రి అవంతి

| Edited By: Ravi Kiran

Sep 15, 2019 | 5:30 PM

గోదావరిలో ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవన్నారు పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ . ప్రమాదానికి కారణమైన రాయల్ వశిష్ట అనే ప్రైవేటు బోటు కోడిగుడ్ల వెంకటరమణ అనే వ్యక్తిదని మంత్రి తెలిపారు. ప్రమాధ ఘటనకు సంబంధించి బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటిన రంగంలోకి దిగిందని, తక్షణం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. గతంలో ఉదయభాస్కర్.. ఝాన్సీరాణి.. ఇప్పుడు రాయల్ వశిష్ఠ ఇదిలా ఉంటే గతంలో ఉదయ్‌భాస్కర్‌.. […]

Godavari Boat Accident: ఆ బోటుకు అనుమతి లేదు: మంత్రి అవంతి
Follow us on

గోదావరిలో ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవన్నారు పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ . ప్రమాదానికి కారణమైన రాయల్ వశిష్ట అనే ప్రైవేటు బోటు కోడిగుడ్ల వెంకటరమణ అనే వ్యక్తిదని మంత్రి తెలిపారు. ప్రమాధ ఘటనకు సంబంధించి బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటిన రంగంలోకి దిగిందని, తక్షణం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు.

గతంలో ఉదయభాస్కర్.. ఝాన్సీరాణి.. ఇప్పుడు రాయల్ వశిష్ఠ

ఇదిలా ఉంటే గతంలో ఉదయ్‌భాస్కర్‌.. ఝాన్సీరాణి…ఇప్పుడు రాయల్ వశిష్ఠ బోట్లు ప్రమాదాలకు కారణమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి 61మందితో బయలుదేరిన రాయల్‌ వశిష్ట బోటు కచులూరుమందం వద్ద ప్రమాదానికి గురైంది. గతంలో దేవీపట్నం మండలం కచులూరుమందం వద్ద ఎగువకు ప్రయాణం చేసేటప్పుడు పలు ప్రమాదాలు జరిగాయి. బోటు ఎగువకు వెళ్లే చోట బలమైన రాయి కారణంగా ప్రవాహ ఉద్ధృతితో ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు, స్ధానికులు చెబుతున్నారు. ఇదే ప్రదేశంలో గతంలోనూ రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 1964లో ఉదయభాస్కర్‌ అనే బోటు మునిగి 60మంది మృతి చెందారు. తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగి ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.  తాజాగా ఈ ఉదయం జరిగిన ప్రమాదంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.