సుప్రీంకోర్టును, జడ్జీలను అపహాస్యం చేస్తూ తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కామిక్ కునాల్ కమ్రా అన్నారు. రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిలును మంజూరు చేయడంపై ఈయన వ్యంగ్యంగా ట్వీట్లు చేసిన విషయం గమనార్హం. కానీ వీటిని ఉపసంహరించుకోబోనని, ఆపాలజీ చెప్పడం గానీ, జరిమానా కట్టడం గానీ చేయబోనని ఆయన ట్వీట్ చేశారు. ‘నో లాయర్స్, నో ఆపాలజీ, నో ఫైన్, నో వేస్ట్ ఆఫ్ స్పేస్’ అని అన్నారు.కునాల్ ట్వీట్లకు గాను ఆయనపై కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపాలని అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ మొత్తం 8 మందికి అనుమతినిచ్చారు. కునాల్ లక్ష్మణ రేఖ దాటాడని ఆయన ఆరోపించారు. కాగా అర్నాబ్ గోస్వామి లోగడ ముంబై నుంచి లక్నోకి విమానంలో ప్రయాణిస్తుండగా కునాల్ ఆయన పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆయనను పలు ఎయిర్ లైన్స్ సంస్థలు బ్యాన్ చేశాయి.
No lawyers, No apology, No fine, No waste of space ??? pic.twitter.com/B1U7dkVB1W
— Kunal Kamra (@kunalkamra88) November 13, 2020