
బీహార్ కొత్త డిప్యూటీ సీఎం గా బీజేపీ కి చెందిన తర్కిషోర్ ప్రసాద్ నియమితులు కానున్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించవచ్ఛునని తెలుస్తోంది. కతిహార్ కు చెందిన తర్కిషోర్ ప్రసాద్ అప్పుడే బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. తనకు బీజేపీ, సంఘ్ పరివార్ 40 ఏళ్లుగా రాజకీయ జీవితాన్ని ఇచ్చాయని, ఏ బాధ్యతను అప్పగించినా నెరవేరుస్తానని సుశీల్ కుమార్ ట్వీట్ చేశారు. పార్టీ కార్యకర్తగా తన పదవిని ఎవరూ లాక్కోలేరని అన్నారు. అటు-బీజేపీ లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ నాయకురాలిగా ఎన్నికవుతున్న రేణుదేవిని ఆయన అభినందించారు.
.