రఫేల్ పేపర్లు లీకైనా మాకేం భయం లేదు: నిర్మలా సీతారామన్

రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. రఫేల్ విషయంలో విపక్షాలవి కేవలం ఆరోపణలేనని ఆమె అన్నారు. అక్రమంగా పొందారనే ఆరోపణలున్న రఫేల్ పత్రాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అనుమతించినా.. తమకు ఎలాంటి సమస్య ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘‘మా పరిస్థితి బలహీనపడిందని నేను అనుకోను. మా వాదన మరింత బలపడింది. ఇలాంటి ముఖ్యమైన పత్రాల్లో ఒక్క పేజీ బయటకు […]

రఫేల్ పేపర్లు లీకైనా మాకేం భయం లేదు: నిర్మలా సీతారామన్

Edited By:

Updated on: Apr 17, 2019 | 5:41 PM

రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. రఫేల్ విషయంలో విపక్షాలవి కేవలం ఆరోపణలేనని ఆమె అన్నారు. అక్రమంగా పొందారనే ఆరోపణలున్న రఫేల్ పత్రాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అనుమతించినా.. తమకు ఎలాంటి సమస్య ఉండదని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘‘మా పరిస్థితి బలహీనపడిందని నేను అనుకోను. మా వాదన మరింత బలపడింది. ఇలాంటి ముఖ్యమైన పత్రాల్లో ఒక్క పేజీ బయటకు వచ్చినా.. అది సమాచారాన్ని దొంగలించడమే. బయటకు వచ్చిన పత్రాలతో మాకు ఎలాంటి నష్టం జరగదు. మా తరఫున మేము స్పష్టంగా ఉన్నాం. అక్రమంగా పొందిన పత్రాలను కొన్ని వార్తా పత్రికలు ప్రచురించాయి. వాటిని పరిశీలించినా సరైన పద్ధతిలోనే రఫేల్‌ను కొనుగోలు చేయడం వలన మాకు ఎలాంటి సమస్య ఉండదు’’ అంటూ పేర్కొన్నారు.