అమెరికాలో అదే నరమేధం.. ఓహియోలో కాల్పులు.. 9 మంది మృతి

|

Aug 04, 2019 | 2:44 PM

టెక్సాస్ లోని వాల్ మార్ట్ స్టోర్స్ లో జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించిన ఘటన మరువకముందే ఓహియోలోని బార్ లో తుపాకీ గర్జించింది. నల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి తన గన్ తో జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించగా.. 16 మంది గాయపడ్డారు. షూటర్ ను పోలీసులు కాల్చి చంపారు. ఈ దుండగుడితో బాటు ఉన్న మరొకడు జీపులో పారిపోయాడని వారు తెలిపారు. అతడికోసం గాలిస్తున్నట్టు చెప్పారు. టెక్సాస్ లో జరిగిన ఘటనకు […]

అమెరికాలో అదే నరమేధం.. ఓహియోలో కాల్పులు.. 9 మంది మృతి
Follow us on

టెక్సాస్ లోని వాల్ మార్ట్ స్టోర్స్ లో జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించిన ఘటన మరువకముందే ఓహియోలోని బార్ లో తుపాకీ గర్జించింది. నల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి తన గన్ తో జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించగా.. 16 మంది గాయపడ్డారు. షూటర్ ను పోలీసులు కాల్చి చంపారు. ఈ దుండగుడితో బాటు ఉన్న మరొకడు జీపులో పారిపోయాడని వారు తెలిపారు. అతడికోసం గాలిస్తున్నట్టు చెప్పారు. టెక్సాస్ లో జరిగిన ఘటనకు జాతి విద్వేషమే కారణమని భావిస్తుండగా.. ఈ ఓహియో సంఘటన కూడా అలాంటిదే అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో గాయ[పడినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. యుఎస్ లో మళ్ళీ జాతి విద్వేషం బుసలు కొడుతున్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఓ వైపు అధ్యక్షుడు ట్రంప్.. గన్ కల్చర్ కు స్వస్తి చెప్పాలని పిలుపునిస్తుండగానే మరోవైపు ఈ తుపాకీ సంస్కృతి పెరిగిపోతోంది.