సీబీఐ కోర్టులో పలు కీలక కేసుల విచారణ.. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఊరట

|

Feb 10, 2021 | 7:19 PM

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నిమ్మగడ్డ ప్రసాద్ కు ధర్మాసనం..

సీబీఐ కోర్టులో పలు కీలక కేసుల విచారణ.. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఊరట
Follow us on

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నిమ్మగడ్డ ప్రసాద్ కు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. రూ. 5లక్షల బాండ్ సమర్పించాలని నిమ్మగడ్డ ప్రసాద్ కు సీబీఐ కోర్టు ఆదేశించింది.

ఈనెల 11 నుంచి ఆగస్టు 2 వరకు హైదరాబాద్ దాటి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 4న విచారణకు హాజరు కావాలని నిమ్మగడ్డ ప్రసాద్ కు సీబీఐ కోర్టు ఆదేశించింది. పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల విచారణ రేపటికి వాయిదా వేసింది. అరబిందో, ఇండియా సిమెంట్స్, లేపాక్షి నాలెడ్జ్ కేసుల విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. దాల్మియా సిమెంట్స్ కేసు ఈనెల 26కి వాయిదా పడింది. ఎమ్మార్ కేసు విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

 

Read more:

ఆ చట్టాలు రైతుల మేలు కోసమేనన్న ప్రధాని మోదీ.. కొత్త చట్టాలతో మద్దతు ధరపై కొనుగోళ్లు పెరిగాయని వెల్లడి

ఉగాది నుంచి వాలంటీర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..నవరత్నాలపై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి