Niharika Insta Post: ‘పైన ఆకాశం.. కింద ఇసుక.. మధ్యలో’.. హనీమూన్‌ ఫొటోలను షేర్‌ చేసిన మెగా డాటర్‌..

Niharika Shares Honeymoon photos: నాగబాబు గారాల పట్టి నిహారిక గత డిసెంబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్‌ నిబంధనలను...

Niharika Insta Post: పైన ఆకాశం.. కింద ఇసుక.. మధ్యలో.. హనీమూన్‌ ఫొటోలను షేర్‌ చేసిన మెగా డాటర్‌..

Updated on: Jan 04, 2021 | 1:06 PM

Niharika Shares Honeymoon photos: నాగబాబు గారాల పట్టి నిహారిక గత డిసెంబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ వేదికగా జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకల్లో మెగా కుటుంబమంతా హల్చల్‌ చేసింది.
ఇదిలా ఉంటే వివాహం జరిగిన నాటి నుంచి తన భర్తతో గడుపుతోన్న మధుర క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోందీ మెగాడాటర్. ఈ క్రమంలోనే తాజాగా హానీమూన్‌ కోసం మాల్దీవుడు వెళ్లిన ఈ జంట అక్కడ సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. సముద్రపు ఒడ్డున భర్తతో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసి నిహారిక.. ‘పైన ఆకాశం.. కింద ఇసుక.. మా ఇద్దరి మధ్య ప్రశాంతత’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ ఫొటోలతో పాటు క్రిస్మస్‌ వేడుకల్లో దిగిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

చివరిగా సైరా నర్సింహారెడ్డి తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించని నిహారిక.. ప్రస్తుతం తన సినీ జీవితానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినీ రంగ ప్రవేశం చేయనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అటు చైతన్య కానీ, నిహారిక కానీ స్పందించక పోవడం గమనార్హం.

Also Read: Nidhi Agarwal : షాపింగ్ అంటే చాలా ఇష్టమంటున్న ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ… ఈ ఏడాది ఎక్కువ వర్క్ చేస్తానంటున్న ముద్దుగుమ్మ…